12వ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలి – 30% ఐఆర్ ప్రకటించాలి
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు డిమాండ్
ఉపాధ్యాయ–ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. రాయచోటిలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు.గత ప్రభుత్వంలో 11వ పీఆర్సీ బకాయిలు, డీఎలు, సరెండర్ లీవులు తదితర ఆర్థిక బకాయిలు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఎత్తిచూపారు. ప్రతిపక్షంలో ఉన్న నేటి పాలకులు అధికారంలోకి వచ్చాక ఆ బకాయిలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చినా అమలు చేయకపోవడం దారుణమని విమర్శించారు. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి, పెండింగ్ డీఎలను వెంటనే