ఏపీ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు, మంత్రి మనోహర్తో ఏలూరుకు చెందిన ఏపీ వడ్డీల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి శనివారం అమరావతిలో భేటీ అయ్యారు. కొల్లేరు ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని వినతి పత్రం అందజేశారు. ఆ ప్రాంత ప్రజల ఇబ్బందులను వివరించారు. కొల్లేరు ప్రజల ఉపాధి అంశంపై త్వరలో ప్రకటన విడుదల చేస్తామని నాయకులు హామీ ఇచ్చారని వెంకటలక్ష్మి తెలిపారు.