విశాఖపట్నం: విశాఖ సాగర తీరానికి సమీపంలో కనువిందు చేస్తున్న భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు
విశాఖ సాగర తీరానికి సమీపంలో భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు కనువిందు చేస్తున్నాయి. శనివారం ఉదయం జరగనున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో భారత నౌకా దళానికి చెందిన ఏడు యుద్ధనౌకలు, ఒక కోస్ట్ గార్డ్ నౌక శుక్రవారం ఉదయం 7 గంటలకు విశాఖ తీరానికి సమీపంలో వచ్చాయి. ఒకవైపు బీచ్ రోడ్ లో మోడీతో సహా రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు యోగా చేస్తే సముద్రం పైన ఉన్నటువంటి షిప్పులపై నౌకదళ ఉద్యోగులు యోగా చేస్తూ ప్రపంచ రికార్డు నెలకొల్పనున్నారు.