జగ్గంపేట: ఆత్యాచారానికి గురైన బాధితురాలు విషయంలో ప్రభుత్వం న్యాయం చేయాలి అని గోకవరంలో రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్
ఈనెల 8వ తేదీన గోకవరం బంగాలిపేటకు చెందిన పదహారేళ్ల అమ్మాయిపై అత్యాచారం చేసిన గాంధీ,కిరణ్ లతోపాటు ఇంకో ఇద్దరినీ కూడా అరెస్టు చేసి,కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గోకవరం బంగాలీపేటలో ప్రజా సంఘాల నాయకులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నకుల వీరాంజనేయులు మాట్లాడుతూ 16 ఏళ్ల అమ్మాయిపై దారుణమైన ఘటన జరగడం చాలా దారుణమైన చర్య అని,తక్షణమే బాధితురాలికి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని,అలాగే ఉద్యోగం కల్పించాలని, పంట భూమి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.