కుప్పం: రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధురాలు మృతి
కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలోని డీకేపల్లి రైల్వే గేటు వద్ద రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందింది. ఆమెకు 65 ఏళ్లు ఉంటాయని ట్రాక్ దాటుతుండగా వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడ్డ వృద్ధురాలు మృతి చెందింది. ఎవరికైనా వృద్ధురాలి ఆచూకీ తెలిస్తే 9000716436 నెంబర్ను సంప్రదించాలని రైల్వే పోలీసులు తెలిపారు.