నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని వివిధ గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలకు బుధవారం చర్చీలు ముస్తాబయ్యాయి, మండలంలోని శెట్టివీడు, ముత్యాలపాడు,గొడిగి నూరు, చింతలచెరువు, చిన్న వంగలి, పెద్ద వంగలి, మల్లె వేముల, గ్రామాల్లో చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు, ఆయా గ్రామాల్లో పశువుల పాక, క్రిస్మస్ ట్రీ ప్రత్యేక స్టార్ ల తో ఏర్పాటు చేశారు, బుధవారం అర్ధరాత్రి నుంచి ఆయా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి