KK లైన్ రాయగడలో కలపడం వలన VZM, కొత్తవలస, శ్రీకాకుళం, KKలో కొన్ని భాగాలు ఒడిశాకి వెళ్లిపోతున్నాయని విశాఖ వైసీపీ అధ్యక్షుడు కె.కె. రాజు అన్నారు. బుధవారం విశాఖలో ఆయన మాట్లాడారు.CM చంద్రబాబు కేంద్రంలో శాసించే స్థాయిలో ఉండి కూడా న్యాయం చేయలేకపోతున్నారని విమర్శించారు.విభజన చట్టంలో KK లైన్తో కూడిన డివిజన్ ఇస్తామని పేర్కొన్నారన్నారు. ఒడిశా నేతలు తమ రాష్ట్రానికి న్యాయం చేస్తుంటే మీరు ఏమి చేస్తున్నారని నిలదీశారు.