కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలోని గ్యాస్ గోడౌన్ ఏరియాలో తాగునీటి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకి విన్నవించిన మహిళలు
కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని గ్యాస్ గోడౌన్ ఏరియాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని పరిష్కరించాలని మంగళవారం ఎమ్మెల్యే సురేంద్రబాబును ఆ కాలనీ మహిళలు కలిసి విన్నవించారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ కు ఫోన్ చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. తన సొంత నిధులతో గ్యాస్ గోడౌన్ ఏరియాలో రెండు ట్యాంకులు ఏర్పాటు చేయిస్తానని మహిళలకు హామీ ఇచ్చారు. దీంతో మహిళలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.