పిచ్చాటూరు మండలం ఎస్ ఎస్ బి పేటలో గుంతల రోడ్డు ను బాగు చేయాలని ప్రజల నిరసన
SSB పేటలో గుంతల రోడ్డును బాగు చేయించాలని ప్రజల నిరసన పిచ్చాటూరు మండలం SSB పేట, హనుమంతపురం గ్రామాలకు వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలమయమై ప్రయాణానికి ఇబ్బందికరంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. అధికారులకు తెలిపినా సమస్యను పట్టించుకోలేదని, రోడ్డులోని గుంతల్లో గ్రామ యువకులు నిలుచుకొని మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. గ్రామానికి వస్తున్న ఆర్టీసీ బస్సు రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉందన్నారు. అధికారులు స్పందించి గుంతలను పూడ్చాలని వారు కోరారు.