తాటిపర్తి గ్రామంబావిలో మృతి చెందిన తోలాటి సూరిబాబు, రంపం శ్రీనుగా గుర్తింపు. ఏఎస్పి దేవరాజ్ పాటిల్ మీడియాతో మాట్లాడారు
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని తాటిపర్తిలోని ఒక బావిలో రెండు వ్యక్తుల మృతదేహాలు లభ్యం కావడం కలకలం సృష్టించింది. మృతులను తాటిపర్తి గ్రామానికి చెందిన తోలాటి సూరిబాబు, రంపం శ్రీనుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, క్లూస్ టీం పరిశీలించారు. వారిది హత్యా, ఆత్మహత్యా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.