జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును తనిఖీ చేసి, భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన కలెక్టర్
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి. సత్యప్రసాద్ మంగళవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో దరూర్ క్యాంప్ లో గల ఈవీఎం లను భద్రపరిచిన గోదామును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు తనిఖీ చేశారు.ప్రతినెల ఈవీఎం లను తనిఖీ చేయడం జరుగుతుందని గోడౌన్ లోని యంత్రాల భద్రత, సిసి కెమెరాల పనితీరు, సాంకేతికపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించారు.గోదాము వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం అప్రమత్తతో పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. రాజా గౌడ్,జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కలెక్టర్ ఏవో హకీమ్....