మేడ్చల్: ఆటో డ్రైవర్ మీన్ రెడ్డి ఆత్మహత్యపై కుషాయిగూడలో ఉద్రిక్తత
ఆటో డ్రైవర్ మీన్ రెడ్డి ఆత్మహత్యపై కుషాయిగూడలో ఉద్రిక్తత నెలకొంది. రాధిక కూడలి వద్ద పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు చేరి నిరసన తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల వేధింపుల వల్లే మీ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని ఆందోళనకారులు ఆరోపించారు. కుషాయిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, ఎస్ఐలను సస్పెండ్ చేయాలని ఆత్మహత్యకు కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.