జమ్మలమడుగు: జమ్మలమడుగు : పట్టణంలోని ప్రైవేట్ కాలేజీలో శక్తి యాప్ వినియోగంపై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణం లోని శ్రీ శిరిడి సాయి డిగ్రీ కాలేజీలో మంగళవారం జిల్లా ఎస్పి ఉత్తర్వుల మేరకు జమ్మలమడుగు DSP వెంకటేశ్వర రావు పర్యవేక్షణలో, అర్బన్ సీఐ. నరేష్ బాబు దిశా నిర్దేశాలతో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులకు ఈవ్ టీజింగ్, శక్తి అప్, డయల్ 100, 112, 1091, 1930,, సైబర్ క్రైమ్, ఇతరత్రా విషయాల గురించి వాటి యొక్క అవశ్యకత గురించి తెలియజేశారు. ఈ సమావేశంలో జమ్మలమడుగు అర్బన్ ఎఎస్ఐ,శక్తి టీం, ప్రిన్సిపల్ మరియు విద్యార్థినులు హాజరు అయినారు.