మార్కాపురం జిల్లా గిద్దలూరులో సోమవారం స్వదేశీ వస్తువులు వినియోగించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ బిజెపి నాయకులు వినూత్న ప్రచార కార్యక్రమం చేపట్టారు. పట్టణ అధ్యక్షుడు అప్పిశెట్టి ఉదయ శంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగక జిల్లా నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు. స్వదేశీ వస్తువులు ఉపయోగించడం వల్ల వచ్చే టాక్స్ ల వల్ల దేశాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కలుగుతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి స్వదేశీ వస్తువులోనే కొనుగోలు చేయాలని బిజెపి నాయకులు విజ్ఞప్తి చేశారు.