ఉప్పల్: ఈసీఐఎల్ లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు
శుక్రవారం రోజున 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ లోని సీపీఐ కార్యాలయం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జీ. దామోదర్ రెడ్డి ఎగురవేశారు.ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్. బోస్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఫలాలను దేశ పౌరులకు అందించడంలో పాలకులు విఫలం అయ్యారని వారు ఆరోపించారు.దేశ సంపదను దేశ ప్రజలందరికీ పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు.