పాన్‌గల్: వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో మార్నిగ్ వాక్ ను ప్రారంభించిన రాచాల యుగంధర్ గౌడ్
వనపర్తి జిల్లా మదనాపురం మండలం కేంద్రంలో ఆదివారం బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలతో కలిసి మార్నిగ్ వాక్ కార్యక్రమంను ప్రారంభించారు.స్థానిక శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు సంఘ నాయకులు రాచాలా ను సన్మానించారు. మండల కేంద్రంలో, మాదిగ రైల్వే స్టేషన్ లో పర్యటించి ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు.