పరిగి: సోమన్ గుర్తి గేటు సమీపంలో అదుపుతప్పి కారు బోల్తా, పలువురికి గాయాలు ఆసుపత్రికి తరలింపు
అదుపుతప్పి కారు బోల్తా కొట్టడంతో పలువురికి గాయాలు అయిన ఘటన వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని సోమనుగుర్తి గేటు సమీపంలో బీజాపూర్ నేషనల్ హైవేపై అదుపుతప్పి కారు బోల్తా కొట్టడంతో పలువురికి గాయాలు కావడం జరిగింది. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసింది.