"స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభివాన్" కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్డీవో సువర్ణ
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో "స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభివాన్" కార్యక్రమం నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా RDO సువర్ణ హాజరై కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్డీవో సువర్ణకు డిఎంహెచ్వో ఫైరోజా బేగం, ఐసిడిఎస్ పిడి ప్రమీల పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.