మార్కాపురం: తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి పత్తి పంటకు తీవ్ర నష్టం జరిగిందని రైతుల ఆవేదన
తుపాన్ ప్రభావంతో మార్కాపురం మండలంలోని పంటలకు తీవ్ర నష్టం చేకూరింది. పంటల్లో నీరు నిలబడి కాయ రంగు మారి రాలిపోయే పరిస్థితి నెలకొన్నది. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. మండలంలోని కొండేపల్లికి చెందిన రైతు నారాయణరెడ్డి వెంకటసుబ్బమ్మ దంపతులు రెండు ఎకరాలలో పత్తి పంటను సాగు చేసినట్లు తెలిపారు. సుమారు లక్ష పెట్టుబడి అయింది అన్నారు. వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.