పుల్కల్: సింగూరు ప్రాజెక్టుకు 47 వేల క్యూసెక్కుల వరద 6గేట్లు ఓపెన్
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని పూల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులోని భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి 47888 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని నీటిపారుదల శాఖ ఏఈ బుధవారం తెలిపారు. వరద ప్రవాహం పెరిగిన నేపథ్యంలో ప్రాజెక్టు 6 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు సింగూరు దివ్య ప్రాంతాల ప్రజలు మాంజీర నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశువుల కాపరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.