ఆమనగల్: సింగపురం చెరువు కింది వాగును కబ్జా కాకుండా కాపాడాలని తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసిన రైతులు
రంగారెడ్డి జిల్లా, ఆమనగల్లు మండలం, సింగపురం గ్రామంలోని చెరువు కింది వాగు కబ్జా కాకుండా కాపాడాలని గురువారం మధ్యాహ్నం తాహాసిల్దార్ కు రైతులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. వాగు నక్షలో ఉందని, తమ పొలాల వద్దకు వాగులో నుండి వెళ్తున్నామని తెలిపారు. వాగు కబ్జాకు గురైతే పొలాలకు వెళ్లేందుకు దారి ఉండదని, కబ్జాకు యత్నించే వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో రైతుల కోరారు.