డిసెంబర్ 29 నుంచి జనవరి 4 వరకు జరిగే అఖిలభారత మహాసభలు విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు పిలుపు
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లోని కార్మిక భవన్లో సిఐటియు జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు మాట్లాడుతూ సిఐటియు ఆధ్వర్యంలో డిసెంబర్ 29 నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో అఖిలభారత మహాసభలు జరగనున్నాయని, ఈ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లాలోని ఉద్యోగ కార్మికులు అందరికీ ఆయన పిలుపునిచ్చారు.