చారా వాండ్ల పల్లి గ్రామంలో గర్భిణీలకు, బాలింతలకు సమతుల ఆహరం పైన అవగాహన కల్పించిన డాక్టర్ సాయిశ్రీ
చారా వాండ్ల పల్లి గ్రామంలో గర్భిణీలకు,బాలింతలకు సమతుల ఆహరం పైన వాల్మీకిపురం మండలం చింతపర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ సాయిశ్రీ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయిశ్రీ,డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ సోమవారం చారావాండ్ల పల్లి లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ఈశ్వర్,సురేష్ లతో కలసి ప్రారంభించారు.శరీరంలో జీవక్రియలు అన్ని సక్రమంగా జరిగి ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతీ ఒక్కరూ అన్ని పోషక విలువలు ఆకు కూరలు,కూరగాయలు, పండ్లు,పాలు,తృణ ధాన్యాలు తీసుకోవాలన్నారు