మంత్రాలయం: రైతులు పంట పొలాలలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: మండల వ్యవసాయ అధికారిణి సుచరిత
పెద్ద కడబూరు:ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారిణి సుచరిత సూచించారు. మంగళవారం పెద్ద కడబూరు మండలంలోని పీకలబెట్ట గ్రామ శివారుల్లో పత్తి పంటలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. పంటల పరిరక్షణకు సంబంధించిన రైతులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఈ-పంట నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ పంట నమోదును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.