ప్రభుత్వ పెన్షనర్లు 2026 జనవరి నుంచి 2026 ఫిబ్రవరి 28 లోపు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించాలని గుత్తి ఉప ఖజానా అధికారి సురేష్ బాబు తెలిపారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో గురువారం ఎస్టీఓ పెన్షనర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీఓ సురేష్ బాబు మాట్లాడుతూ ముందుగా సమర్పించిన సర్టిఫికెట్లు ఆమోదించబడవన్నారు. స్థానికంగా ఉన్న వారు ఎస్టీఓ కార్యాలయం లేదా మీ సేవలో లేదా గుత్తి పెన్షనర్ల భవనంలో సమర్పించవచ్చునన్నారు. విదేశాల్లో ఉన్న వారు అక్కడ ఎంబసీ కార్యాలయాల్లో సర్టిఫై చేయించుకొని డీఎల్సీ సమర్పించాల్సి ఉంటుందన్నారు.