ప్రకాశం జిల్లా తాళ్లూరు వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో ప్రసాద్ రావు ఎరువుల డీలర్లకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏవో మాట్లాడుతూ రైతులకు సేవ చేయడంలో ఎరువుల డీలర్లు కూడా బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. అన్నదాతకు సహకరించకుండా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా డీలర్ పని చేయాలని కోరారు.