మహిళను కొట్టి హింసించిన ఘటనపై వివర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళా సంఘాలు
Ongole Urban, Prakasam | Sep 16, 2025
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువులపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను కట్టేసి బెల్టుతో కొట్టడమే కాకుండా కాలుతో తంతు చేతులతో కొడుతూ తీవ్రంగా హింసించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో స్థానికంగా ఉండే కాలనీవాసులు భర్త భార్య నుండి ఆమెను కాపాడి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు అయితే పోలీసులు ఈ ఘటనపై ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. దీంతో మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కట్టుకున్న భర్త భార్యను కాపాడాల్సింది పోయి దారుణంగా హింసించడాన్నే తీవ్రంగా తప్పుపడుతున్నాయి