ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని ఉల్లపాలెం గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లినిక్ ని బుధవారం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆకస్మికంగా సందర్శించారు. తుఫాను పరిస్థితుల నేపథ్యంలో గ్రామ పరిసర ప్రాంతాలను పరిశీలించి తర్వాత హెల్త్ క్లినిక్ ని పరిశీలించారు. రోగుల కొరకు సిద్ధంగా ఉన్న మందులు తుఫాను పరిస్థితుల్లో నేపథ్యంలో ప్రజలకు వైద్య సహాయం అందించేందుకు ఎటువంటి పరికరాలు ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలానే రోగులకు ఎటువంటి వైద్య సహాయం అందుతుందో అడిగి తెలుసుకున్నారు. అధికారులు తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.