భూపాలపల్లి: ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్షణ కిట్లు ఎంతో దోహదం : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
గౌడన్నలు తాటి చెట్టు ఎక్కి కల్లు తీసే సమయంలో వారికి ప్రమాదాలు జరుగకుండా ఉండటానికి కాటమయ్య రక్షణ కిట్లను తప్పనిసరిగా వినియోగించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు శుక్రవారం సాయంత్రం భూపాలపల్లి మండలం ఎస్.ఎం కొత్తపల్లి గ్రామ శివారు సోలిపేట తాటి వనంలో జిల్లా బీసీ సంక్షేమ మరియు ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.