యూత్ భవిష్యత్తును చిదిమేస్తున్న డ్రగ్స్ మాఫియాపై H-NEW ఉక్కుపాదం మోపిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. 2025లో రూ.6.46 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేసి, 366 మంది నేరగాళ్లను కటకటాల్లోకి నెట్టినట్లు చెప్పారు. MDMA నుంచి గంజాయి వరకు ఏ రూపంలో డ్రగ్స్ వచ్చినా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో భారీగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, యువతను వ్యసనాలకు దూరం చేయడంలో సఫలీకృతమయ్యా మన్నారు.