తడ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కుతూ జారిపడి వ్యక్తి మృతి
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని తడ రైల్వే స్టేషన్ లో బుధవారం విషాదం నెలకొంది. నెల్లూరు నుండి చెన్నై వెళ్తున్న మెమో రైలు (66030) ఎక్కే క్రమంలో ఓ వ్యక్తి జారిపడ్డాడు. pf no 2 కి, రైలుకి మధ్యలో పడిపోవడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. హుటా హుటిన క్షతగాత్రున్ని తడ రైల్వే స్టేషన్ మాస్టర్ సమాచారంతో 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. కానీ మృతుడు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు