సత్తుపల్లి: రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సత్తుపల్లి ఆర్టీసీ డిపో ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహణ
రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపో గ్యారేజ్ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ శిబిరంలో 50 మంది రక్తదాతలు పాల్గొని రక్తాన్ని దానం చేశారు.ఈ సందర్భంగా డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ జనవరి 1 నుండి 31 వ తేదీ వరకు జరిగే రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా నేడు సత్తుపల్లి ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ నుండి వచ్చిన వైద్య సిబ్బంది రక్త దాతల నుండి రక్తాన్ని సేకరించారు. రక్తదాతలకు సత్తుపల్లి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పండ్ల రసాలను అందించారు..