పత్తికొండ: పత్తికొండ మాజీ ఎమ్మెల్యే పై దాడిని ఖండిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ క్రాంతి నాయుడు
సంతకాల సేకరణ సందర్భంగా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో దాడులకు తావు లేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులపై ఉందన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు.