కుప్పం: ఎంపీ పురందేశ్వరిని కలిసిన తులసీనాథ్
రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరిని బీజేపీ కుప్పం ఇన్ఛార్జ్ తులసీనాథ్ తిరుపతిలో కలిశారు. తిరుపతిలో జరుగుతున్న జాతీయ మహిళ సాధికార సదస్సులో పాల్గొనేందుకు సోమవారం తిరుపతి వచ్చిన ఎంపీ పురందేశ్వరిని బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు, తులసీనాథ్ కలిశారు. గ్రామీణ స్థాయిలో పార్టీ క్యాడర్ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని పురందేశ్వరి సూచించినట్లు ఆయన తెలిపారు.