నార్కెట్పల్లి: ప్రజా పాలనలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం:MLA వేముల వీరేశం
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం సుంకెనపల్లి గ్రామంలోని రూ.12 లక్షల రూపాయల తో నిర్మించనున్న అంగన్వాడి భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం శంకుస్థాపన చేశారు. అదేవిధంగా గ్రామంలో రూ.5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రజా పాలనలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.