ఆర్టీఏ చెక్ పోస్ట్ నిర్మాణం కోసం తమ వ్యవసాయ భూమిని ఇచ్చామని, కానీ దానికి బదులుగా పట్టాలు చేసి ఇవ్వలేదని బాధితుడు షేక్ అష్ఫక్ ఆరోపించారు. ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండానే ఆ భూమి ప్రస్తుతం కబ్జాలో ఉందన్నారు. రెవెన్యూ, ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తమ భూమిని వెంటనే తిరిగి ఇవ్వాలని అష్ఫక్ వేడుకుంటున్నారు.