ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని జాతీయ మరియు రాష్ట్రీయ రహదారులపై గురువారం పోలీసులు రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడుపుతున్న వాహనదారులను మందలించి పోలీసులు జరిమానా విధించారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లేదంటే ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు అత్యధికంగా ఉంటాయని పోలీసులు వారికి తెలిపారు.