ఇబ్రహీంపట్నం: హయత్ నగర్ డివిజన్లో పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
హయ్యత్ నగర్ డివిజన్లోని వినాయక కాలనీలో కార్పొరేటర్ కల్యం నవజీవన్ రెడ్డి అధికారులతో కలిసి సోమవారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీలో చేపడుతున్న నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని వీలైనంత త్వరగా పనులను ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించి ఎటువంటి సమస్యలున్న తమకు తెలియజేయాలని స్థానికులను కోరారు.