నెల్లూరుజిల్లా, ఇందుకూరుపేట మండలం, యాగర్ల మలుపు వద్ద కారు అదుపుతప్పి ప్రక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం లో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు సురక్షితంగా ఉన్నారు. మైపాడు వైపు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న కారు యాగర్ల మలుపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా కారును పోలీసులు బయటకు తీశారు.