రాజేంద్రనగర్: శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి దేహశుద్ధి
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారిపై అత్యాచారం జరిగిన విషయం విదితమే. ఈ ఘటనలో నిందితుడు ఆంజనేయులుని స్థానికులు చితక బాధి పోలీసులకు అప్పగించారు. కాగా అత్యాచారం చేసిన నిందితుడు బాలికకు తీవ్రమైన రక్తస్రావం రావడం గమనించి బాలికను చాపలో చుట్టాడు. బాలిక తల్లి గమనించి వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.