ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలంకేంద్రంలో శుక్రవారం కామేపల్లి రైతులు 1430 బేళ్లు తీసుకువచ్చారు. కేవలం 610 బేళ్లు మాత్రమే కొనుగోలు చేసి 820 బేళ్లు తిరస్కరించారు. వేలం కేంద్రం మూసివేసే దశలో తిరస్కరణలు పెరుగుతుంటే రైతులు ఆవేదనకు గురవుతున్నారు. ప్రతిరోజూ భారీ సంఖ్యలో బేళ్లును తిరస్కరించడం రైతులకు శాపంగా మారింది. దీంతో పొగాకును ఏం చేయాలని రైతులు తల్లడిల్లుతున్నారు.