లేజర్ షోకు పుట్టపర్తి చిత్రావతి హారతి ఘాట్
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. మంగళవారం రాత్రి సత్యసాయి శతజయంతి వేడుకలలో భాగంగా చిత్రావతి హారతి ఘాట్ వద్ద లేజర్ షో నిర్వహించాలని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్ణయించింది. సౌండ్ &లేజర్ షో ట్రైల్ రన్ నిర్వహించారు. ఇందులో బాబా జీవిత చరిత్ర, చేసిన సేవ, చెప్పిన వాక్యాలు ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 13 నుంచి 23 వరకు కార్యక్రమం కొనసాగనున్నట్లు సమాచారం