అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామం వద్ద రైతులు సాగు చేసిన మిరప పంట పొలాలను జిల్లా ఉద్యాన శాఖ అధికారిని ఉమాదేవి స్థానిక అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఎండు తెగులకు గురైన మిరప పొలాలకు సంబంధించి రైతులకు ఎండు తెగులు నివారణకు సంబంధించి సూచనలు సలహాలు అందించారు.