పెద్దపప్పూరు మండల పరిధిలోని పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు సోమవారం పట్టుకొని సీజ్ చేశారు. ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది జూటూరు వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ట్రాక్టర్ డ్రైవర్లు సుబ్బారెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి లపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు.