మంత్రాలయం: బుధూరు గ్రామానికి చెందిన విద్యార్థిని జెస్సి కి కేజీబీవీ లో చదువుకునేందుకు సహాయం అందించిన మంత్రి నారా లోకేష్
మంత్రాలయం:పేదరికం కారణంగా చదువుకు దూరమైన మంత్రాలయం మండలం బుదురు గ్రామానికి చెందిన జెస్సీకి మంత్రి నారా లోకేశ్ ఆదివారం సాయం అందించారు. ఆయన కర్నూలు డీఈఓ శ్యాముల్కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జెస్సీకి కెజిబివిలో సీటు లభించింది. ఈ కార్యక్రమంలో మంత్రాలయం సొసైటీ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ శాంతి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.