రాయదుర్గం: నిర్దేశించిన ప్రమాణాల మేరకే టపాసుల విక్రయ దుకాణాలు ఏర్పాటు చేయాలి : పట్టణంలో తహసీల్దార్ నాగరాజు
టపాసుల విక్రయ దుకాణాలు నిర్దేశించిన ప్రమాణాల మేరకే ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని తహసీల్దార్ నాగరాజు హెచ్చరించారు. శనివారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని జూ.కళాశాల మైదానంంలో ఏర్పాటు చేసిన దుకాణాలను తనిఖీ చేశారు. అగ్ని ప్రమాదాలకు తావులేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. అధిక ధరలకు విక్రయాలు జరపరాదని సూచించారు. ఇప్పటికే వ్యాపారులతో సమావేశాలు నిర్వహించామన్నారు.