పెద్దమందడి: మోజర్ల చెక్ పోస్ట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా లక్ష రూపాయలు సీజ్ చేసిన పోలీసులు
వనపర్తి జిల్లా పెద్దమందడి పోలీస్ స్టేషన్, మోజర్ల NH 44 దగ్గర బుధవారం సాయంత్రం ఐదు గంటలకు వాహనాలు తనిఖీ చేస్తుండగా 1,00,000 రూపాయలు ఎలాంటి అనుమతి పత్రాలు లేనందున సీజ్ చేయడం జరిగినది. .ఈ సందర్భంగా ఎస్ఐ శివకుమార్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేస్తామని, నగదు, మద్యంపై ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, మోడల్ కోడ్ అమలులోకి వచ్చినందున ప్రజలు రూ.50వేల రూపాయల నగదు కంటే ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లే వారు పెద్ద మొత్తంలో బంగారం, ఇతర వస్తువులను తీసుకెళ్లేవారు ఆధారాలను చూపాలని తెలిపారు