ఉదయగిరి: మాసాయిపేట బీసీ కాలనీ ఎదురుగా ఉన్న తోటలో అక్రమ శ్రీ గ్రంధం చెట్లు నరికివేత పై ఎస్సై ఇంద్రసేనారెడ్డి విచారణ
ఉదయగిరి మండలం మాసాయిపేట బీసీ కాలనీ ఎదురుగా ఉన్న తోటలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వారం వ్యవధిలో రెండు సార్లు శ్రీగంధం చెట్లను నరికి తరలించారు. దీనిపై పోలీసులకు రైతు గానుగపెంట నారాయణరెడ్డి ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఎస్ఐ కర్నాటి ఇంద్రసేనారెడ్డి ఘటనా ప్రాంతానికి చేరుకొని చెట్లు నరికిన ప్రాంతాన్ని పరిశీలించి, రైతు నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.