రేణిగుంట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద అనుమానితుల వాహనాలు తనిఖీలు చేపట్టిన ఎస్సై నాగరాజు
రేణిగుంటలో అనుమానితుల వాహనాల తనిఖీలు రేణిగుంట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సోమవారం ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు అనుమానితుల వాహనాలను తనిఖీ చేశారు. తిరుపతిలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనతో అప్రమత్తమైన రేణిగుంట పోలీసులు ప్రధాన రహదారులపై వాహనాలను ఆపి పరిశీలించారు. అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు.