ప్రకాశం జిల్లా పుల్లలచెరువు కరెంటు లైన్ మెన్ శివ నాయక్ అదృశ్యం మిస్టరీ విషాదంగా మారింది. ఈనెల 24న మార్కాపురం నుంచి విధులకు పుల్లలచెరువు వెళ్ళిన శివ నాయక్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మార్కాపురంలో ఈ నెల 25న మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఆదివారం సాయంత్రం ఎర్రగొండపాలెం సమీపంలోని జాతీయ రహదారి పక్కన సైడ్ కాలవలో అనుమానస్పదంగా శవమైతెలారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.